సుస్వాగతం

ప్రియమైన తెలుగు వారందరికి నమస్కారాలు

LOOK AT THE NEWS

LOOK AT THE NEWS
FOR ALL TELUGU PAPERS

27, నవంబర్ 2009, శుక్రవారం

గీత వ్యథ..

ఎక్కడో దూరంగా గీత వినిపిస్తోంది.వాసాంవి జీర్ణాని యథా విహాయా.. నవాని గృహ్ణాతి నరోపరాణి. అంటూ ఘంటశాల స్వర మాధుర్యం అహ్లాదంగా ఆకర్షిస్తోంది. ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమమేమోనని ఆ వైపుగా వెళ్లాను. కనిపించిన దృశ్యం సాధారణంగా నేటి పరిస్థితుల ప్రభావమే కావచ్చు. కానీ ఎందుకో గుండె కలిచివేసినట్లైంది. అసలు మనమెక్కడ ఉన్నాం. గీతాచార్యుడు ప్రబోధించిందేమిటి, మనం చేస్తున్నదేమిటి.
ప్రపంచ వ్యాప్తంగా మేనేజ్మెంట్(management) రంగానికి ఓ ఆదిగ్రంధంలా విలసిల్లుతున్న భగవద్గీత నేడు విషాదగీతమైందని గుండె క్షోభపడింది.
18 అధ్యాయాలు..
760 శ్లోకాలు..
108 ఉపనిషత్ సారం..
భగవద్గీత.

ఈ రోజు మార్గశుద్ద ఏకాదశి.
గీతా జయంతి.
భగవద్గీత ఆవిర్భవించిన రోజు.
విశేషమేంటంటే భగవద్గీతకు మూలమైన శ్రీ కృష్ణుడు,అర్జునుడు,మార్గశిరమాసం,వ్యాసుడు వీళ్లంతా విష్ణు రూపాలే..
రామాయణాన్ని నారదుడు వాల్మీకికి చెప్పాడు, భారతాన్ని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు, భాగవతాన్ని శుకుడు పరీక్షిత్తుకు చెప్పాడు.
కానీ.. భగవానుడైన నారాయణుడే స్వయంగా అర్జునునికి ప్రబోధించిందే భగవద్గీత. భగవతా నారయణేన స్వయం..
ఇదీ భగవద్గీతకున్న ప్రథమ ప్రశస్తి.

గీత కేవలం పారాయణ గ్రంథం కాదు..ఆచరణ గ్రంథం కూడా.
లౌకికమైన సామాజిక జీవితంలో , పారలౌకికమైన ఆధ్యాత్మిక జీవితంలో మనం లబ్ధి పొందడానికి అనేక మార్గాలను చూపిన గ్రంథమది.
ఎందరో మహానుభావులకు మార్గదర్శకమైంది గీత.
మహాత్మాగాంధి తన అహింసా సిద్ధాంతానికి ప్రేరణ గీతేనని చెప్పారు. స్వామి వివేకానంద, చైతన్యప్రభు వంటివాళ్లె కాదు..
ఐన్ స్టీన్ వంటి విదేశీయులు సైతం గీతతో ప్రేరణ పొందినవారే.
మహాభారతంలోని భీష్మ పర్వంలో 25వ అధ్యాయం మొదలుకొని 42వ అధ్యాయం వరకు ఉన్న 18 అధ్యాయాలు భగవద్గీతగా ప్రశస్తికెక్కాయి.
పేరుకు భారత అంతర్భాగమే ఐనా భగవద్గీత సర్వ స్వతంత్రమైన ప్రత్యేక గ్రంథం. తన బంధు మిత్రులపై యుద్ధం చేయనని అర్జునుడు భీష్మించినపుడు అతనికి కర్తవ్య బోధ చేస్తూ జగద్గురువైన శ్రీ కృష్ణుడు చెప్పిందే భగవద్గీత. జీవన యుద్ధ రంగంలో మన పాత్ర కర్తవ్యాన్ని భగవంతుడు బోధిస్తే ముగిసిపోయిన జీవితం గురించి నిర్వేదాన్ని వ్యక్తం చేయడానికి గీతను వాడుతున్నాం.
చనిపోయిన వారి కోసం ఏడ్చే ఓపిక లేక ప్రత్యామ్నాయమైంది గీత.భగవద్గీత నేడు అంత్యక్రియలకు నేపథ్య సంగీతంలా మారిపోయింది.ఎక్కడ గీత వినిపించినా అక్కడ ఎవరో ఒకరు చనిపోయి ఉంటారనే అభిప్రాయం ఆధునిక తెలుగువాడిలో బలపడింది.

భగవద్గీత మానవ జీవన సంస్కృతీ సారం.
కనీసం రోజుకొకసారైన.. వీలుకాకపోతే వారానికొకసారైనా భగవద్గీత వినండి.
అంత్యక్రియలతో భగవద్గీతకు ముడిపెట్టకండి.
వినోదానికైనా.. విషాదానికైనా..
గీతలాపన చేయడమే గీతాచార్యుడికి ఘన నివాళి.

26, నవంబర్ 2009, గురువారం

26/11.. ఏడాదైంది



26/11..మారణ హోమానికి నేటితో ఏడాది.
భారతీయతను పరిహసిస్తూ ఉన్మాదం పెట్రేగిన రోజది..
కళ్లముందు కదలాడుతూనే ఉంది.
ఉగ్రవాదుల మూణ్నాళ్ల ముచ్చట..విధివంచితుల పాలిట మూడు నిశిరాత్రులైనాయి.
166 మందికి శాశ్వత నిద్ర ఐంది.
లష్కరే పేరిట పెల్లుబికిన ఉగ్రధ్వంసం..
ముంబైలో సృష్టించిన మారణ కాండకు సరిగ్గా ఏడాది.

26/11..దోషులను శిక్షించడంలో ప్రభుత్వం విఫలమైంది
పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇదేదో ఆనందంగా జరుపుకోవలసిన దినం కాదు.
ప్రతీ భారతీయుడు తనను తాను ప్రశ్నించుకునే తరుణం..
దేశ వాణిజ్య రాజధానిపై విరుచుకుపడిన ఉగ్రవాద పెనుభూతపు మచ్చలను తుదిపేసినా .. ఆ బాధాస్మృతులను ఎలా మరిచేది.?

9/11 అమెరికా దాడులతో ఈ దాడిని పోల్చినా ..
అమెరికన్లలో కనిపించిన స్పూర్థి మనలో కనిపించదేం.
26/11 గా దాడులను వర్ణించినా ..
దాడులకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్లేనా..?
ఒకవేళ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తే మిగిలిన ప్రజాస్వామ్య పాదాలు(చట్టం, న్యాయం, మీడీ) ఏంచేస్తున్నాయి..?
ముంబై దారుణకాండలో ప్రత్యక్షంగా పాల్గొని సజీవంగా దొరికిన కసబ్ విషయంలో ఇంత తాత్సారం దేనికి..?
అమెరికన్ల మాదిరి మన సరిహద్దులు పటిష్ట పరుచుకోలేమా..?
సహనానికి మారుపేరైన భారతావని తన విద్యుక్త ధర్మాన్ని మరిచిపోతుందా,,
ముష్కర పాకిస్తాన్ ఎత్తుగడలను తిప్పికొట్టలేదా..
ఈ ప్రశ్నలన్ని ఓ సగటు భారతీయుడిని సంవత్సరకాలంగా వేధిస్తున్నాయి.

కసబ్ ను శిక్షించడం కాకుండా అతన్ని ఒక హీరో మాదిరి వార్తల్లో ప్రముఖంగా చూపిస్తుంటె ప్రతీ ఒక్క భారతీయుడి ఒళ్ళు మండిపొతోంది.
మొదట కసబ్ ను శిక్షిస్తే తప్ప ముంబై దాడుల్లో ప్రాణాలు కొల్పోయిన వారి ఆత్మ శాంతించదు.
పాలక, ప్రతిపక్షాలు దేశ రక్షణ విషయంలో ఏకం కావాలి.
ఎదైనా పోటీ ఉంటే అది దేశ అంతర్గతంగా జరిగేది..
పక్కవాడు మనమీద దాడి చేసినప్పుడు కూడా రాజకీయం చేస్తే అంతకు మించిన మూర్ఖత్వం ఇంకోటి లేదు.
అందుకే భా జా పా కు ఎన్నికల్లో చుక్కెదురైంది.
పనికిమాలిన విషయాలపై గంటలు గంటలు చర్చించే మన నేతలు దేశాన్ని ఉగ్రవాద దాడుల నుంచి కాపాడే విషయంలో మరింతగా చొరవ తీసుకొని కలిసికట్టుగా ముందడుగు వేయాలి.
ఇకనైనా ఉగ్రవాదం బారినుంచి భారతావనిని కాపాడేందుకు మనవంతుగా పోరాడుదాం.

26/11 లో ప్రాణాలు కోల్పోయిన ప్రతీ ఒక్క వీరుడికి వందనం..
జై హింద్ ..

18, నవంబర్ 2009, బుధవారం

ఒబులపురం కుంభకోణం

ఒబులపురం కుంభకోణం
ఎది నిజమొ ఎంత అబద్ధమో
ప్రతిపక్షాల హొరు
పాలకపక్షపు జొరు
ఇవన్ని చూస్తు ప్రజల బేజారు
రాష్త్రమంతా ఎమి జరుగుతొంది..
ఒబులపురం గనుల వ్యవహారమంతా ..
పాలక ప్రతిపక్షాల ఎత్తుగడెన అనిపిస్తొంది,,
కాకపొతె కోతికో కొబ్బరి చిప్ప దొరికినట్టు
ప్రతిపక్షాలకు ఎన్ని సమస్యలున్నా ఈ సమస్యె పెద్దగ కనిపిస్తొంది,,
విదెశాల సంస్కృతంటే ఇష్టపడే ఓ నేతలూ..
మీరు మేత మాని మొదలు దుర్మార్గులను శిక్షించే
పరాయి సంస్కృతికి పట్టం కట్టండి..
రాష్ట్ర ఖజాన రక్షణకు పాటుపడండి

8, నవంబర్ 2009, ఆదివారం

పిల్లల దగ్గర పాఠాలు నేర్చుకుందాం రండి..!


బోసి నవ్వుల పాపాయి .. బుడిబుడి నడతల బుజ్జాయి.. చిలకపలుకుల చిన్నారి.. వీరంతా పర్సనాలిటీ గురువులు.. పాపాయి బోసినవ్వులో ఎన్ని అర్థాలో,, నిష్కల్మషంగా ఉండే ఆ నవ్వుకు ఎన్ని పరమార్థాలో,, హఠాత్తుగా ఏడ్చినా .. ఇంతలోనే నవ్వేస్తారు,, అమ్మ కోప్పడినా .. నాన్న గారాబం చేసినా,, అన్నీ నవ్వుతూనే అహ్వానిస్తారు,,
అందుకే జీవితంలో అనుభవించే కష్టాలకు పాపాయి నవ్వే ఓ మందు. నడక రాకున్నా నడవడానికి బుజ్జాయి చేసే ప్రయత్నం.. నవ్వు తెప్పించినా అదో నిత్య నూతన సూత్రం,, పరుగెడుతూ.. పడిపోతూ.. దెబ్బలతాకిడికి విలవిల్లాడుతూ.. ఐనా సరే,, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు,, ఒకవైపు నడుస్తూనే లోకమంతా చుట్టేస్తారు.. జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులను కూడా అలాగే ఎదుర్కొని లక్ష్య సాధనకు కృషి చేయమంటారు..

ఇప్పుడంతా భాషా సమస్య.. ఎక్కడ చూసినా భాషా గొడవే.. అసలు అమ్మ భాషను మించిన భాషేముంది,, కానీ.. చిన్నారులు తమ చిలకపలుకుల్లోనే.. భాషా మాధుర్యాన్ని రుచి చూపిస్తారు,, అంతే కాదు,, చిన్న వయసులోనే వ్యాకరణమంతా నేర్చుకొని .. పెద్దవారీకి మార్గనిర్దేశనం చేస్తారు. తల్లి భాషకు తెలియని వయసులోనే పట్టం కట్టి,, తెలిసే వయసులో పెద్దల మాటలకు తలొగ్గే దీనస్థితి..?

బాలవాక్కు బ్రహ్మ వాక్కంటారు కదా.. అందుకే బాలల చేష్టలు గురుముఖాలు,, అందుకే వాటిని అనుసరించి ఆచరిస్తే,, జీవితమంతా నవ్వులేనవ్వులు..

ఎందుకో నా మదిని ఇన్ని ఆవేదనలు..?

ఎందుకో నా మదిని ఇన్ని ఆవేదనలు..? చేసే ప్రతీ ఉద్యోగంలో ఎదో ఒక వెలితి,, ఇంతకూ లోపం నాలోనా..? పని చేసే విధానంలోనా..? ఎన్నోసార్లు కాంప్రమైజ్ అవుదామని అనుకున్నా .. ఒక రకమైన ఇబ్బంది.. ఇద్దరు విలన్లు,, రెండు రకాల మనస్తత్వాలు,, ఇద్దరిదీ ఆధిపత్య పోరు.. ఒకరేమో బాస్ ఐతే మరొకరు ఫెమినిస్ట్ ఇద్దరూ ఇద్దరే.. ఒకరిని కాదని మరొకరు,, ఇద్దరి మధ్యలో నేనొక పావును,, ఒకరితో మాట్లాడితే మరొకరికి కోపం.. అసలు నాపాత్రేంటో..? ఏంచేయాలొ అర్థం కావడం లేదు,, ఇద్దరికీ రెపొర్త్ చేయాలట.. ఒకరు మాట్లాడకుండా వేధిస్తే.. మరొకరు అతిగా మాట్లాడి హింసిస్తున్నారు.
ఇలా జరుగుతుందేమిటాని పైవారిని అడిగితే.. వారి నుంచీ నొ ఆన్సర్ .. నేనేం చేయాలో తోచక అఙాతమే శరణ్యమనిపిస్తోంది.. ఎందుకో నా మదిని ఇన్ని ఆవేదనలు..?

1, నవంబర్ 2009, ఆదివారం

తెలుగుకు వెలుగెప్పుడు..?

మొన్న మైదుకూరులో జరిగిన సంఘటన ప్రతీ తెలుగువాడికి గొడ్డలిపెట్టు. అమాయకులైన పసిపిల్లలను ఇబ్బంది పెడుతూ వారిలోపల విషబీజాలు నాటడానికి జరిగిన ప్రయత్నం ప్రతీఒక్కరు ఖండించాల్సిందే. ఐతే.. ఇక్కడ ఒక విషయం గమనించాలి,, ఇటువంటి ఘటనలు ఒక్క కడప జిల్లాలోనే కాదు,, రాష్ట్రంలో దాదాపుగా ప్రతీ చోట ఇదే పరిస్థితి.. అసలు మాతృభాష కాకుండా పరాయి భాషపై వ్యామొహం పెంచుకుని.. అమాయకులైన పసిపిల్లలపై బలవంతంగా పరభాష రుద్దడం వెనుక ఆంతర్యమేమిటో..?
ఏముంది.. ఉద్యోగాల కోసమేనంటారా..? చదువుల వరకే ఆంగ్లం అందిపుచ్చుకొని మిగిలిన సమయంలో తెలుగు భాషా మాధుర్యాన్ని రుచిచూపించవచ్చు కదా..! ఏది ఎమైనా.. రోజులు మారాయి.. తెలుగు నేల మీద నిలబడి రామా అంటే అదేదో వినకూడని మాట విన్నట్టుగా తెలుగు మాట్లాడితే బాధ పడిపోతున్నారు భాష విచ్చిన్నకారులు. అంతెందుకు.. తెలుగులో పదాలన్నీ నేడు వంకర్లు తిరిగిపోతున్నాయి.. అక్షరమాలలొ లు,లూ(క్షమించండి.. ఈ లిపిలో కూడా లు,లూల జాడే లేదు)కనుమరుగైపోయాయి గుఱ్రము కాస్తా గుర్రముగా మారింది. ఋతుపవనాలలో ఋ పోయి రు వచ్చింది. ఋషి కూడా రుషిగా మరిపోయారు.. ఇక ఇప్పుడు రాష్ట్రమంతటా ప్రభంజనం సృష్టిస్తున్న చానెల్స్ చూడాలంటేనే విసుగు వస్తోంది.. ఒకవేళ ఇష్టంగా చూద్దామంటే మనకు వచ్చిన తెలుగుకూడా మాయమైపోతుందేమో..?(యాంకర్లు అలా ఉన్నారు మరి..!) ఇప్పటికే లాటిన్, అరేమియా భాషలు కనుమరుగైపోయాయి.. అదే స్థితి మరో వందేళ్లలో మనభాషకూ వస్తుందేమో..? అందుకే.. తెలుగుతల్లి రోదిస్తోంది.. ప్రతీ తెలుగు అభిమాని హృదయం క్షోభిస్తోంది..
కనీసం..
ఈరోజైనా తెలుగుకు పట్టం కడుదామని.. తెలుగువాకిట తెలుగుభాషా పరిమళాలు వెదజల్లుదామని.. ప్రతీ ఇంటా తెలుగు కుసుమాలు విరబూయిస్తామని.. ప్రతిన బూనుదాం.. చిన్నారులకు ఇళ్లలోనైనా తెలుగు చెప్పేందుకు కృషి చేద్దాం.. కనిపించిన తెలుగువారితో తెలుగులోనే మాట్లాదుదాం.. దేశభాషలందు తెలుగు లెస్స

Ranganath

"Visit blogadda.com to discover Indian blogs"

అనుచరులు