సుస్వాగతం

ప్రియమైన తెలుగు వారందరికి నమస్కారాలు

LOOK AT THE NEWS

LOOK AT THE NEWS
FOR ALL TELUGU PAPERS

30, ఏప్రిల్ 2009, గురువారం

NAVARASAALU

THE FOLLOW RASAAS ARE CALLED NAVARASAALU IN TELUGU. THE HUMANBEING FOLLOW NAVARASAAS IN THEIR REGULAR LIFE IN DIFFERENT STAGES:

SHAANTAM, KARUNA, BHEEBHATSA, BHAYANAKA,
SRUNGARA, ADBHUTA, VEERA, ROUDRA, HAASYA


చేనేత కార్మికులు(CHENETHA KAARMIKULU)

వ్యవసాయం తర్వాత గ్రామీణ రంగంలో ఎక్కువగా ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగమే. రాష్ట్రంలోనే దాదాపు 3.5 లక్షల చేనేత మగ్గాలున్నాయి. వీటిపై 5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. పరోక్షంగా మరో 20 లక్షల కుటుంబాలకు ఈ రంగమే జీవనాధారం. చేనేత కార్మికులు నైపుణ్యంతో భారతీయ వస్త్రాలకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టారు. పోచంపల్లి, గద్వాల, ధర్మవరం పేర్లు వింటేనే నాజూకు వస్త్రాలు గుర్తుకువస్తాయి. ఐతే ఈ చేనేత కార్మికులు ఇక్కడే ఆగిపోలేదు. మరమగ్గాలు వచ్చినప్పుడు వ్యాపార కౌశలం ప్రదర్శించి దూసుకు వెళ్లారు. అలాంటిది అటు చేనేత కార్మికులు , ఇటు మరమగ్గాల కుటుంబాలు ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణం ప్రభుత్వవిధానాలే కారణం కావడం దురదృష్తకరం.యాంత్రీకరణను ప్రోత్సహించడం ద్వారా చేనేతరంగాన్ని దెబ్బ తీశారు.
మన్నికైన వస్త్రాలతో ఒకప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత చేనేత వృత్తిది. భారీపరిశ్రమలకు పెద్దపీట వేస్తున్న ఈ ప్రభుత్వాలు మన దేశంలో 2వేల ఏళ్లుగా మన ఆర్థిక వ్యవస్థలో మన సామాజిక సాంస్కృతిక జీవనంలో భాగమైన చేనేత రంగాన్ని కాపడుకోవడానికి కంటితుడుపు చర్యలు మినహాయించి శాశ్వతప్రణాళికలేలేవు. నేత రంగం ఉత్థాన పతనాలకు సిరిసిల్ల ప్రత్యక్ష నిదర్శనం. 1920వ దశకంలోనే మహారాష్ట్ర వెళ్లి నైపుణ్యం సాధించిన సిరిసిల్ల చేనేత కార్మికులు 1970 దశకం నాటికి సొంత మరమగ్గాలు నడిపించడం ప్రారంభించారు. 1990 దశకం నాటికి దాదాపు 12వేల మరమగ్గాలతో సిరిసిల్ల కళకళలాడింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాలతో ఈ రంగంపై మొదటి దెబ్బ పడింది. ప్రభుత్వం నూలు ఎగుమతికి అనుమతి ఇవ్వడంతో ధర పెరిగిపోయింది. కేంద్రం 9.25 శాతం ఎక్సైజ్ సుంకం విధించడం ద్వారా ఈ కుటీరపరిశ్రమ పూర్తిగా దెబ్బ తిన్నది. మరోవైపు పెద్ద పరిశ్రమలకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడమే కాక పాతయంత్రాలు దిగుమతి చేసుకోవడానికి కస్టంస్ సుంకం తగ్గించింది. కొత్త సాంకేతిక పరిఙానం పేరుతో 50శాతం సబ్సిడీ ఇచ్చింది. దీంతో ఈ పెద్ద కంపెనీలు నూలు వడకడం, నేయడం, రంగులు అద్దడం వంటి పనులు చౌకగా జరుగుతున్నాయి. ప్రభుత్వ విధానాల వల్ల చేనేత కార్మికుల జీవితాలు వీధిన పడ్డాయి. ఒక దశలో చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య వందలకు చేరింది. ఈ దశలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు రాజకీయ అంశాలు అయ్యయి తప్ప వారి కన్నీళ్లు తుడవలేకపోయాయి. ఇప్పటికైనా అన్ని పార్టీల నేతలు రాజకీయాలు మరచి నేతన్నలను ఆదుకోవడానికి ఓ ప్రత్యేకమైన విధానాన్ని రూపొందిస్తే చేనేత పునర్వైభవం పొందుతుందేమో..ప్రభుత్వ విధానాల వల్ల చేనేత కార్మికుల జీవితాలు వీధిన పడ్డాయి. ఒక దశలో చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య వందలకు చేరింది. ఈ దశలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు రాజకీయ అంశాలు అయ్యయి తప్ప వారి కన్నీళ్లు తుడవలేకపోయాయి. ఇప్పటికైనా అన్ని పార్టీల నేతలు రాజకీయాలు మరచి నేతన్నలను ఆదుకోవడానికి ఓ ప్రత్యేకమైన విధానాన్ని రూపొందిస్తే చేనేత పునర్వైభవం పొందుతుందేమో..
ప్రభుత్వ విధానాల వల్ల చేనేత కార్మికుల జీవితాలు వీధిన పడ్డాయి. ఒక దశలో చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య వందలకు చేరింది. ఈ దశలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు రాజకీయ అంశాలు అయ్యయి తప్ప వారి కన్నీళ్లు తుడవలేకపోయాయి. ఇప్పటికైనా అన్ని పార్టీల నేతలు రాజకీయాలు మరచి నేతన్నలను ఆదుకోవడానికి ఓ ప్రత్యేకమైన విధానాన్ని రూపొందిస్తే చేనేత పునర్వైభవం పొందుతుందేమో..
















Ranganath

"Visit blogadda.com to discover Indian blogs"

అనుచరులు