సుస్వాగతం

ప్రియమైన తెలుగు వారందరికి నమస్కారాలు

LOOK AT THE NEWS

LOOK AT THE NEWS
FOR ALL TELUGU PAPERS

26, నవంబర్ 2009, గురువారం

26/11.. ఏడాదైంది



26/11..మారణ హోమానికి నేటితో ఏడాది.
భారతీయతను పరిహసిస్తూ ఉన్మాదం పెట్రేగిన రోజది..
కళ్లముందు కదలాడుతూనే ఉంది.
ఉగ్రవాదుల మూణ్నాళ్ల ముచ్చట..విధివంచితుల పాలిట మూడు నిశిరాత్రులైనాయి.
166 మందికి శాశ్వత నిద్ర ఐంది.
లష్కరే పేరిట పెల్లుబికిన ఉగ్రధ్వంసం..
ముంబైలో సృష్టించిన మారణ కాండకు సరిగ్గా ఏడాది.

26/11..దోషులను శిక్షించడంలో ప్రభుత్వం విఫలమైంది
పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇదేదో ఆనందంగా జరుపుకోవలసిన దినం కాదు.
ప్రతీ భారతీయుడు తనను తాను ప్రశ్నించుకునే తరుణం..
దేశ వాణిజ్య రాజధానిపై విరుచుకుపడిన ఉగ్రవాద పెనుభూతపు మచ్చలను తుదిపేసినా .. ఆ బాధాస్మృతులను ఎలా మరిచేది.?

9/11 అమెరికా దాడులతో ఈ దాడిని పోల్చినా ..
అమెరికన్లలో కనిపించిన స్పూర్థి మనలో కనిపించదేం.
26/11 గా దాడులను వర్ణించినా ..
దాడులకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్లేనా..?
ఒకవేళ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తే మిగిలిన ప్రజాస్వామ్య పాదాలు(చట్టం, న్యాయం, మీడీ) ఏంచేస్తున్నాయి..?
ముంబై దారుణకాండలో ప్రత్యక్షంగా పాల్గొని సజీవంగా దొరికిన కసబ్ విషయంలో ఇంత తాత్సారం దేనికి..?
అమెరికన్ల మాదిరి మన సరిహద్దులు పటిష్ట పరుచుకోలేమా..?
సహనానికి మారుపేరైన భారతావని తన విద్యుక్త ధర్మాన్ని మరిచిపోతుందా,,
ముష్కర పాకిస్తాన్ ఎత్తుగడలను తిప్పికొట్టలేదా..
ఈ ప్రశ్నలన్ని ఓ సగటు భారతీయుడిని సంవత్సరకాలంగా వేధిస్తున్నాయి.

కసబ్ ను శిక్షించడం కాకుండా అతన్ని ఒక హీరో మాదిరి వార్తల్లో ప్రముఖంగా చూపిస్తుంటె ప్రతీ ఒక్క భారతీయుడి ఒళ్ళు మండిపొతోంది.
మొదట కసబ్ ను శిక్షిస్తే తప్ప ముంబై దాడుల్లో ప్రాణాలు కొల్పోయిన వారి ఆత్మ శాంతించదు.
పాలక, ప్రతిపక్షాలు దేశ రక్షణ విషయంలో ఏకం కావాలి.
ఎదైనా పోటీ ఉంటే అది దేశ అంతర్గతంగా జరిగేది..
పక్కవాడు మనమీద దాడి చేసినప్పుడు కూడా రాజకీయం చేస్తే అంతకు మించిన మూర్ఖత్వం ఇంకోటి లేదు.
అందుకే భా జా పా కు ఎన్నికల్లో చుక్కెదురైంది.
పనికిమాలిన విషయాలపై గంటలు గంటలు చర్చించే మన నేతలు దేశాన్ని ఉగ్రవాద దాడుల నుంచి కాపాడే విషయంలో మరింతగా చొరవ తీసుకొని కలిసికట్టుగా ముందడుగు వేయాలి.
ఇకనైనా ఉగ్రవాదం బారినుంచి భారతావనిని కాపాడేందుకు మనవంతుగా పోరాడుదాం.

26/11 లో ప్రాణాలు కోల్పోయిన ప్రతీ ఒక్క వీరుడికి వందనం..
జై హింద్ ..

కామెంట్‌లు లేవు:

Ranganath

"Visit blogadda.com to discover Indian blogs"

అనుచరులు