బోసి నవ్వుల పాపాయి .. బుడిబుడి నడతల బుజ్జాయి.. చిలకపలుకుల చిన్నారి.. వీరంతా పర్సనాలిటీ గురువులు.. పాపాయి బోసినవ్వులో ఎన్ని అర్థాలో,, నిష్కల్మషంగా ఉండే ఆ నవ్వుకు ఎన్ని పరమార్థాలో,, హఠాత్తుగా ఏడ్చినా .. ఇంతలోనే నవ్వేస్తారు,, అమ్మ కోప్పడినా .. నాన్న గారాబం చేసినా,, అన్నీ నవ్వుతూనే అహ్వానిస్తారు,,
అందుకే జీవితంలో అనుభవించే కష్టాలకు పాపాయి నవ్వే ఓ మందు. నడక రాకున్నా నడవడానికి బుజ్జాయి చేసే ప్రయత్నం.. నవ్వు తెప్పించినా అదో నిత్య నూతన సూత్రం,, పరుగెడుతూ.. పడిపోతూ.. దెబ్బలతాకిడికి విలవిల్లాడుతూ.. ఐనా సరే,, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు,, ఒకవైపు నడుస్తూనే లోకమంతా చుట్టేస్తారు.. జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులను కూడా అలాగే ఎదుర్కొని లక్ష్య సాధనకు కృషి చేయమంటారు..
ఇప్పుడంతా భాషా సమస్య.. ఎక్కడ చూసినా భాషా గొడవే.. అసలు అమ్మ భాషను మించిన భాషేముంది,, కానీ.. చిన్నారులు తమ చిలకపలుకుల్లోనే.. భాషా మాధుర్యాన్ని రుచి చూపిస్తారు,, అంతే కాదు,, చిన్న వయసులోనే వ్యాకరణమంతా నేర్చుకొని .. పెద్దవారీకి మార్గనిర్దేశనం చేస్తారు. తల్లి భాషకు తెలియని వయసులోనే పట్టం కట్టి,, తెలిసే వయసులో పెద్దల మాటలకు తలొగ్గే దీనస్థితి..?
బాలవాక్కు బ్రహ్మ వాక్కంటారు కదా.. అందుకే బాలల చేష్టలు గురుముఖాలు,, అందుకే వాటిని అనుసరించి ఆచరిస్తే,, జీవితమంతా నవ్వులేనవ్వులు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి