ఏముంది.. ఉద్యోగాల కోసమేనంటారా..? చదువుల వరకే ఆంగ్లం అందిపుచ్చుకొని మిగిలిన సమయంలో తెలుగు భాషా మాధుర్యాన్ని రుచిచూపించవచ్చు కదా..! ఏది ఎమైనా.. రోజులు మారాయి.. తెలుగు నేల మీద నిలబడి రామా అంటే అదేదో వినకూడని మాట విన్నట్టుగా తెలుగు మాట్లాడితే బాధ పడిపోతున్నారు భాష విచ్చిన్నకారులు. అంతెందుకు.. తెలుగులో పదాలన్నీ నేడు వంకర్లు తిరిగిపోతున్నాయి.. అక్షరమాలలొ లు,లూ(క్షమించండి.. ఈ లిపిలో కూడా లు,లూల జాడే లేదు)కనుమరుగైపోయాయి గుఱ్రము కాస్తా గుర్రముగా మారింది. ఋతుపవనాలలో ఋ పోయి రు వచ్చింది. ఋషి కూడా రుషిగా మరిపోయారు.. ఇక ఇప్పుడు రాష్ట్రమంతటా ప్రభంజనం సృష్టిస్తున్న చానెల్స్ చూడాలంటేనే విసుగు వస్తోంది.. ఒకవేళ ఇష్టంగా చూద్దామంటే మనకు వచ్చిన తెలుగుకూడా మాయమైపోతుందేమో..?(యాంకర్లు అలా ఉన్నారు మరి..!) ఇప్పటికే లాటిన్, అరేమియా భాషలు కనుమరుగైపోయాయి.. అదే స్థితి మరో వందేళ్లలో మనభాషకూ వస్తుందేమో..? అందుకే.. తెలుగుతల్లి రోదిస్తోంది.. ప్రతీ తెలుగు అభిమాని హృదయం క్షోభిస్తోంది..
కనీసం..
ఈరోజైనా తెలుగుకు పట్టం కడుదామని.. తెలుగువాకిట తెలుగుభాషా పరిమళాలు వెదజల్లుదామని.. ప్రతీ ఇంటా తెలుగు కుసుమాలు విరబూయిస్తామని.. ప్రతిన బూనుదాం.. చిన్నారులకు ఇళ్లలోనైనా తెలుగు చెప్పేందుకు కృషి చేద్దాం.. కనిపించిన తెలుగువారితో తెలుగులోనే మాట్లాదుదాం.. దేశభాషలందు తెలుగు లెస్స
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి